Rains in Telangana | తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rains in Telangana | తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా, సిద్దిపేట, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్ తదితర జిల్లాల్లోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. దీంతో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అలాగే కొన్ని చోట్ల చెట్లు నేలకూలాయి.

Rains in Telangana | పలుచోట్ల నష్టం

అకాల వర్షాలతో ఆయా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెట్లు, స్థంభాలు నేలకొరిగాయి. సూర్యాపేటలో ఈదురు గాలులతో కూడిన వానపడింది. దీంతో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పంటను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మందమర్రితో పాటు సింగరేణి కాలనీల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. అలాగే సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షానికి హుస్నాబాద్​ మార్కెట్‌యార్డులో ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది.

Rains in Telangana | నేలకొరిగిన చెట్లు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో గాలి దుమారంతో భారీ వర్షం పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, నేరేడుచర్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే పలుచోట్ల చెట్లు కూలినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Jewellery Robbery | తుపాకులతో బెదిరించి.. పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *