అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jewellery Robbery | కరీంనగర్ (Karimnagar) లో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి కొందరు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్‌లోని కోర్టు ఆవరణలో పీఎంజే జ్యువెలరీ (PMJ Jewellery) షాపును ఉదయం సిబ్బంది తెరిచారు. కొద్దిసేపటికే ఐదుగురు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. సిబ్బందిపై కాల్పులు జరిపి భయాందోళనకు గురిచేశారు. అనంతరం భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Jewellery Robbery | సిబ్బందికి గాయాలు
దుండగుల కాల్పుల్లో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. అనంతరం నిందితులు భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని పరారీ అయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
#Robbery at #GunPoint in Karimnagar
Five Armed men (#Robbers) stormed into #PMJjewellery showroom in #Karimnagar , #Telangana, they opened fired, injuring the staff and looted a large quantity of #gold #jewellery, and fled away.
Reportedly they fired several rounds and… pic.twitter.com/foWP5vz2Uc
— Surya Reddy (@jsuryareddy) May 3, 2026
ఇది కూడా చదవండి : Hyderabad Accident | కారుతో బైకును ఢీకొట్టి.. బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లాడు

