Electric Shock | బోధన్​లో విషాదం.. విద్యుత్ షాక్​తో దంపతుల మృతి

బోధన్​ మండలంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేసేందుకు వెళ్లిన భార్య.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త విద్యుత్​షాక్​కు గురై మృతి చెందారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Electric Shock | బోధన్​ మండలంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేసేందుకు వెళ్లి విద్యుత్​తీగలు తగిలి మహిళ మృతిచెందగా.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త సైతం షాక్​కు గురై దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన బోధన్ (Bodhan)​ మండలంలోని ఊట్​పల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

Electric Shock | విద్యుత్​ సరఫరా కావడంతో..

మండలంలోని ఊట్​పల్లిలో సంజీవ్​, జ్యోతి దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. అయితే ఆదివారం జ్యోతి దుస్తులు ఆరేసేందుకు దండంను ముట్టకుంది. అయితే అప్పటికే ఆ దండానికి విద్యుత్​ సరఫరా ఉండడంతో ఆమె విద్యుత్​ షాక్​కు గురైంది. ఆమె అరుపులు విన్న భర్త సంజీవ్​ ఆమెను కాపాడేందుకు వెళ్లి ఆయన సైతం విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరు షాక్​తో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించారు. దంపతుల మృతితో ముగ్గురు కూతుళ్లు అనాథలుగా మారారు. ఊట్​పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన బోధన్ రూరల్(Bodhan Rural Police) ఎస్సై రాజశేఖర్ దర్యాప్తు చేపట్టారు.

bodhan 3

ఇది కూడా చదవండి: తిరుపతిలో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *