Bhupalpally DTO Death | వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్​.. డీటీవో మృతి

వాహనాలు తనిఖీ చేస్తున్న డీటీవోను టిప్పర్​ ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhupalpally DTO Death | జయశంకర్​ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరకాల-భూపాలపల్లి హైవేపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అధికారులపైకి బొగ్గు టిప్పర్ దూసుకొచ్చింది.

 Bhupalpally DTO Death | 15 రోజుల క్రితమే బదిలీపై..

డీటీవో వెంకన్న ఆధ్వర్యంలో అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ బొగ్గు టిప్పర్​ వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. దీంతో డీటీవో వెంకన్న తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృత దేహం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. కాగా ఆయన 15 రోజుల క్రితమే భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. డీటీవో కార్యాలయం ఎదుటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. టిప్పర్​ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 Bhupalpally DTO Death | లారీలతో తొక్కించి చంపేస్తారా

డీటీవో వెంకన్న మృతిపై మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని ప్రశ్నించారు. భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి..: Singareni Coal Transport | సింగరేణిలో బొగ్గు రవాణా అత్యంత సురక్షితం : యాజమాన్యం కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *