Ashok Sagar Death | విషాదం.. అశోక్‌సాగర్‌లో మునిగి ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ మృతి

Naresh Chandan

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Ashok Sagar Death | అశోక్‌సాగర్‌లో నీటిలో మునిగి ఓ బ్యాంకు ఉద్యోగి మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడు నగరంలోని ఎస్‌బీఐ ప్రగతినగర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కొటారికారి శ్రీధర్‌గా గుర్తించారు.

Ashok Sagar Death |

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీధర్ ఆదివారం ఉదయం ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం బ్యాంకులో పని ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఆయన ఇంటికి తిరిగి రాలేదు.

అయితే, సాయంత్రం అశోక్‌సాగర్‌లో నీటిలో మునిగి శ్రీధర్ మృతిచెందినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలు అక్కడి వారిని కలిచివేశాయి.

కాలకృత్యాలు తీర్చుకునేందుకు అశోక్‌సాగర్‌లోకి దిగిన సమయంలో ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు భార్య లత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Green Cave Chhattisgarh | భూగర్భంలో ప్రకృతి మాయాజాలం.. బస్తర్ అడవుల్లో వెలుగుచూసిన అరుదైన ‘గ్రీన్ కేవ్’!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *