Voter List Revision | ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైంది..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అంత్యంత విలువైనదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Voter List Revision | ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అంత్యంత విలువైనదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గురువారం పట్టణంలోని తన నివాసంలో వివరాలను నమోదు చేసుకున్నారు.

Voter List Revision | పారదర్శకంగా

జిల్లా ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఓటరు జాబితాల సవరణను ఎన్నికల సంఘం (Election Commission), అధికార యంత్రాంగం పారదర్శకంగా నిర్వహించాలని, అర్హుల పేర్లు తొలగిపోకుండా, డూప్లికేట్ ఓట్లు కొనసాగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచులు, కౌన్సిలర్లు, బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు సమన్వయంతో ప్రతి ఇంటికి వెళ్లి జాబితాలను పరిశీలించాలని సూచించారు. 18ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేలా సహాయం అందించాలని, డూప్లికేట్ నమోదులను గుర్తించి తొలగించాలని కోరారు.

Voter List Revision | కొన్ని రాష్ట్రాల్లో అనుమానాలున్నాయి​..

Voter List Revision

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితాల నిర్వహణపై అనుమానాలున్నాయని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలిగేలా పారదర్శకత పాటించాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఓటు సమాన విలువ కలిగి ఉంటుందని, ఓటు హక్కును కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాలు, వార్డులు, బూత్‌ల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అర్హులైన ఒక్క ఓటరు కూడా తప్పిపోకుండా చూడాలని, డూప్లికేట్, అనర్హులైన వారి ఓట్లను తొలగించి ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి..: Operation Kavach Success | బాన్సువాడలో నాటు తుపాకుల తయారీ.. 8 మంది అరెస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *