Fee Reimbursement GO 9 | ప్రైవేట్ కాలేజీలకు ఊరట.. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే!

ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదలయ్యే వరకు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 (GO Ms No. 9)ని హైకోర్టు తప్పుబట్టింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Fee Reimbursement GO 9 | ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదలయ్యే వరకు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 (GO Ms No. 9)ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ జీవోలోని నిబంధనలపై హైకోర్టు స్టే విధిస్తూ, వచ్చే మంగళవారం వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

Fee Reimbursement GO 9 | బకాయిలు చెల్లించకుండా..

ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు (బకాయిలు) విడుదల కాకుండా, కాలేజీల యాజమాన్యాలు రోజువారీ ఖర్చులను, సిబ్బంది జీతభత్యాలను ఎలా చెల్లిస్తాయని హైకోర్టు  ( Telangana High Court )ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ బకాయిలు చెల్లించకుండా, ఫీజులు వసూలు చేయవద్దని ఆంక్షలు విధించడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం కోసం బడ్జెట్‌లో ఎంత కేటాయించారు? నిధుల విడుదల ప్రక్రియ ఎలా సాగుతోంది? అనే అంశాలపై పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Fee Reimbursement GO 9 | సిబ్బంది ఇబ్బందులు..

నిధులు నిలిచిపోవడం వల్ల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి జీతాలు అందక విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కోర్టు గుర్తించింది. విచారణ సందర్భంగా, ఆగస్టు 15లోపు పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ విడుదల చేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఆలోగా బకాయిలు , బడ్జెట్ వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కొంత ఉపశమనం పొందాయి.

ఇది కూడా చదవండి:  Voter List Revision | ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైంది..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *