Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Forecast | తెలంగాణ (Telangana)లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. రాష్ట్రంపై దాని ప్రభావం లేదు. దీంతో వర్షాలు తగ్గుముకం పట్టాయి. సోమవారం తెలంగాణలో చెదురుమదురు వర్షాలు పడుతాయి. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి.

Telangana Rain Forecast | పారని వాగులు, వంకలు

Telangana Rain Forecast

వానాకాలం మోదలై నెల దాటి పోతున్నా.. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు. జూన్​లో లోటు వర్షపాతం నమోదు అయింది. అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురిసిన వర్షాలతోనే ఈ సీజన్​లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అయితే ఇప్పటికి ఎక్కడ కూడా వాగులు పారడం లేదు. చెరువులు, జలాశయాల్లోకి వరద రావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసి వాగులు పారి, చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయి. లేకపోతే ప్రస్తుతం వేసిన పంటలకు కూడా నీరు అందదని రైతులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..: Nampally Court Fire | నాంపల్లి కోర్టులో అగ్ని ప్రమాదం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *