అక్షరటుడే, వెబ్‌డెస్క్: Modi Foreign Tour | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సోమవారం నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఆయన పర్యటన సాగనుంది. ఢిల్లీ నుంచి ప్రధాని ఉదయం బయలుదేరారు.
ఈ పర్యటన భారతదేశపు ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ (Act East Policy), ‘మహాసాగర్’ (MAHASAGAR) దార్శనికత, స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల భారతదేశానికి ఉన్న దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఇండోనేషియా రాష్ట్రపతి ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు జూలై 6 నుండి 8 వరకు ఆ దేశంలో మోదీ పర్యటించనున్నారు. కాగా ప్రధాని 2018లో తొలిసారి అక్కడ పర్యటించారు. భారత్, ఇండోనేషియాలు నాగరిక, ప్రజల మధ్య సంబంధాలను పంచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ పర్యటన బహుముఖ భాగస్వామ్యంలోని అన్ని అంశాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Modi Foreign Tour | కీలక చర్చలు

ప్రధాని ఇండోనేషియాలోని భారతీయ ప్రవాసులతో మాట్లాడతారు. ఆ దేశ నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్తారు. అక్కడ ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య తదితర అంశాలపై చర్చిస్తారు. అనంతం ప్రధాని మోదీ న్యూజిలాండ్‌లో పర్యటిస్తారు. మార్చి 2025లో ప్రధానమంత్రి లక్సన్ భారతదేశ పర్యటన తర్వాత మన ద్వైపాక్షిక సంబంధాలలో ఏర్పడిన బలమైన బంధాన్ని ఈ పర్యటన అర్థవంతంగా మరింత ముందుకు తీసుకువెళ్తుందని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత పెంపొందించుకోవడంపై ప్రధానమంత్రి లక్సన్‌తో చర్చిస్తానని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Ayodhya Temple Theft | అయోధ్య ఆలయంలో చోరీపై ఉద్దవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు