అక్షరటుడే, వెబ్డెస్క్: 116 Year Old Devotee | అలిపిరి మెట్లెక్కిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు టీటీడీ శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు.
తమిళనాడు (Tamil Nadu)కు చెందిన నవనీతమ్మ అలిపిరి నడకమార్గంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. 116 ఏళ్ల ఆమె తన కుటుంబ సభ్యుల సహకారంతో 3550 మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఆమె తిరుమలకు వచ్చారు. అయితే ఆమె మెట్లు ఎక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె భక్తికి సీఎం చంద్రబాబు (CM Chandrababu), టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఫిదా అయ్యారు.
116 Year Old Devotee | ఆచూకీ కనుగొని..
నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ ఛైర్మన్ ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అధికారులు ఆమె ఆచూకీ కనుగొన్నారు. అనంతరం సోమవారం ఉదయం టీటీడీ అధికారులు దగ్గరుండి వారికి వీఐపీ దర్శనం చేయించారు. నవనీతమ్మ మనవడు దిక్పతీ మాట్లాడుతూ.. తమ అమ్మమ్మ కోరికను నెరవేర్చి, కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ చేసిన ఈ పనిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అలిపిరి మెట్లెక్కిన 116 ఏళ్ల వృద్ధురాలికి సన్మానం
అలిపిరి మెట్లెక్కిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు టీటీడీ శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి,… pic.twitter.com/mrxP0HAuRe
— Akshara Today | Telugu News (@aksharatoday) July 6, 2026
ఇది కూడా చదవండి..: Chandrababu Kuppam Tour | ఏజెన్సీని గంజాయి సాగు కేంద్రంగా మార్చారు : ఏపీ సీఎం చంద్రబాబు