Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలో కోట్ల అవినీతి : మంత్రి పొన్నం

అయోధ్య రామమందిరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ayodhya Ram Mandir | అయోధ్య రామమందిరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణం జరగాలని రాజీవ్ గాంధీ శిల్యానస్​ వేశారని మంత్రి పొన్నం ప్రభాకర్​ గుర్తు చేశారు. రామ మందిరం కోసం ఎంతో మంది డొనేషన్లు ఇచ్చారన్నారు. అయితే విరాళాల సొమ్ములో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిని అయోధ్య ప్రజలు ముందుగానే గమనించారన్నారు. అందుకే బీజేపీని అక్కడ ఓడించారన్నారు.

Ayodhya Ram Mandir | బీజేపీ స్పందించాలి

ponnam

అయోధ్యలో విరాళాల చోరీపై బీజేపీ స్పందించాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్​ చేశారు. దేవుని పేరు మీద, అక్షింతలు పేరుతో ఓట్లు అడిగారని విమర్శించారు. హుండీల్లో డబ్బు ఎత్తుకెళ్లారని, రాముని పేరు మీద దేశ వ్యాప్తంగా వసూలు చేసిన చందాలు మాయం చేశారని ఆరోపించారు. రామాలయంపై బీజేపీ పెద్దలు స్పందించాలన్నారు. రాముడి పేరు మీద రాజకీయాలు చేసే వారు మాట్లాడాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Modi Foreign Tour | విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *