Tadwai Bus Stand | ఆ బస్టాండ్​కు బస్సులు రావు.. ఆకతాయిలకు అడ్డాగా మారిన వైనం

తాడ్వాయి బస్టాండ్​ను ఆకతాయిలు అడ్డాగా మార్చుకున్నారు. శిథిలావస్థకు చేరిన దీనిని కూల్చివేసి కొత్త భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Tadwai Bus Stand | బస్సులు, ప్రయాణికులతో సందడిగా ఉండాల్సిన బస్టాండ్​ ఆకతాయిలకు అడ్డాగా మారింది.  తాడ్వాయి మండల (Tadwai Mandal) కేంద్రంలోని బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో వినియోగించడం లేదు. దీంతో మందుబాబులు అక్కడే సిట్టింగ్​ వేస్తున్నారు.

Tadwai Bus Stand | నిర్మానుష్యంగా ప్రాంగణం..

మండలానికి గుండెకాయ లాంటి ఈ బస్టాండ్ నేడు శిథిలావస్థకు చేరి ప్రజలను భయపెడుతోంది. బస్సుల హారన్లు, జనాల రద్దీతో సందడిగా ఉండాల్సిన ఈ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. పైకప్పు నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపోయి ఇనుప రాడ్లు బయటపడ్డాయి. ఏ క్షణంలో ఏది కూలిపడుతుందో అన్నంత ప్రమాదకరంగా ఉండటంతో గత కొన్నేళ్లుగా ఆర్టీసీ అధికారులు ఇక్కడ బస్సులు ఆపడమే మానేశారు.

Tadwai Bus Stand | వృద్ధులు, విద్యార్థులకు ఇబ్బందులు

Tadwai Bus Stand

వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఎండకు, వానకు తడిస్తూ రోడ్డు మీద నిలబడి వచ్చే బస్సులను చేయి చూపి ఆపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బస్టాండ్ ఆవరణ మొత్తం విరిగిన సీసాలు, మద్యం బాటిళ్లు, చెత్తతో నిండిపోయింది. పగలు, రాత్రి తేడా లేకుండా ఆకతాయిలు, మందుబాబులు ఇక్కడే తిష్ట వేయడంతో సామన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ బస్టాండ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పాచి పట్టిన గోడలు, దుమ్ము కొట్టుకుపోయిన స్తంభాలు, బయటి పోస్టర్ల మాటున కప్పిపుచ్చలేని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మండల కేంద్రంలో ప్రభుత్వానికి ఇంత చులకనగా ఉందా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఇక్కడ ఆగితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రజా సౌకర్యం కోసం కట్టిన ఈ భవనం ఇప్పుడు ప్రజలకే శాపంగా మారింది. వెంటనే దీన్ని కూల్చివేసి కొత్త బస్టాండ్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kaleshwaram Water Release | గోదావరి జలాలు వృథా అవుతున్నా రైతుల గోస పట్టదా : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *