Urea App | యూరియా యాప్​ను వెంటనే రద్దు చేయాలి.. బీఆర్​ఎస్​ డిమాండ్​

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్​ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నందిపేట్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నందిపేట్​: Urea App | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్​ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Former MLA Jeevan Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు నందిపేట్(Nandipet) మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

Urea App | సాగులో ఇబ్బందులు..

యూరియా యాప్ వాడడం తెలియక ఆందోళనలో ఉన్న రైతులు అటు సాగుకు సైతం పూర్తిగా సమయం వెచ్చించలేకపోతున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. యాప్​లో యూరియా బుక్ చేసిన అనంతరం రోజుల తరబడి సొసైటీలు, ప్యాక్స్ సెంటర్ల వద్ద వేచి ఉండాల్సి వస్తుందని.. దీంతో సాగు పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చదువురాని, స్మార్ట్ ఫోన్లు లేని రైతులు అనేకమంది ఉన్నారని వారికి స్మార్ట్ ఫోన్లలో యూరియాను ఎలా బుక్ చేసుకోవాలో తెలియదన్నారు. ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సబబు కాదని.. వెంటనే యాప్​ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. పాత పద్ధతిలోని యూరియాను సరఫరా చేయాలని కోరారు. మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం బీఆర్​ఎస్​ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ ధర్నాలో జెడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, నందిపేట్, డొంకేశ్వర్ మండల రైతులు పాల్గొన్నారు.

67

ఇది కూడా చదవండి: Telangana Voter List Revision | జూన్ 25 నుంచి SIR సర్వే.. కీలక తేదీల షెడ్యూల్ ఇదే

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *