Chittoor Family Suicide | చిత్తూరులో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chittoor Family Suicide | చిత్తూరు జిల్లా (Chittoor District)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

చిత్తూరు జిల్లా దిగుమసపల్లె (Digumasapalle)పంచాయతీ బంగారెడ్డిల్లిలో దామోదరం(30) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. ఆయనకు భార్య నిర్మల(25), కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్యకు ఉన్నారు. అయితే భార్య నిర్మల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఆర్థిక ఇబ్బందులు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

Chittoor Family Suicide | అంత్యక్రియలకు డబ్బులు

దామోదరం మొదట తన భార్య, పిల్లలకు విషమిచ్చాడు. వారు చనిపోయాక తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు దామోదరం సూసైడ్​ నోట్​ రాశారు. తమ చావుకు ఎవరు కారణం కాదని అందులో పేర్కొన్నారు. తమ అంత్యక్రియల కోసం తన అకౌంట్​లో ఉన్న డబ్బులు వినియోగించాలని కోరారు. ఈ మేరకు ఫోన్​ పిన్​ నంబర్​ సైతం రాసి తనువు చాలించాడు.

ఇది కూడా చదవండి..: Lokesh Yoga Session | మంత్రి లోకేశ్‌తో యోగాసనాలు వేయించిన బాబా రామ్‌దేవ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *