Jurala Project Flood | జూరాల గేట్లు ఎత్తివేత.. శ్రీశైలానికి పెరుగుతున్న నీటి ప్రవాహం!

తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jurala Project Flood | తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు నుంచి 30,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి ( Srisailam Reservoir )భారీగా వరద నీరు చేరుతోందని అధికారులు తెలిపారు.

Jurala Project Flood | పెరగనున్న వరద ఉధృతి..

మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమలతో పాటు భీమా నది పరివాహక ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కృష్ణా నదికి వరద మరింత ఉద్ధృతమయ్యే సూచనలున్నాయి. భీమా నది నుంచి అదనపు ప్రవాహాలు జూరాలలో కలవనున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో శ్రీశైలం జలాశయ నీటిమట్టం మరింత వేగంగా పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  PoK Election Violence | పీవోకేలో ఆందోళనలు.. 19 మంది మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *