అక్షరటుడే, హైదరాబాద్ : Tungabhadra Dam Gates | తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ ద్వారా బళ్లారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లాల్లోని లక్షలాది మంది రైతుల దీర్ఘకాలిక నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుంగభద్ర జలాల విషయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తుంగభద్ర డ్యామ్ 33 క్రస్ట్ గేట్లను గురువారం ఉదయం మూడు రాష్ట్రాల సీఎంలు డీకే శివకుమార్, రేవంత్రెడ్డి (CM Revanth Reddy), చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. పంచాయితీ కావాలా.. సమస్య పరిష్కారం కావాలా అంటే.. తాను పరిష్కారమే కోరుకుంటానని పేర్కొన్నారు. ఇది మూడు తరాల సమస్యను పరిష్కరించే కార్యక్రమం అన్నారు.
Tungabhadra Dam Gates | 10 టీఎంసీలు రావడం లేదు
గద్వాల, అలంపూర్, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం (RDS) కు కేటాయించిన 17.9 టీఎంసీల నీళ్లలో కేవలం 5 నుంచి 6 టీఎంసీలే తెలంగాణ రైతాంగం వాడుకుంటోందని సీఎం తెలిపారు. దాదాపు 10 టీఎంసీల నీళ్లు రావడంలేదని పేర్కొన్నారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీటి కేటాయింపుల సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నదీ ఒడ్డున జరిగిన చర్చలు గొప్ప నిర్ణయంగా మారబోతున్నాయన్నారు. రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు నడవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
Tungabhadra Dam Gates | చంద్రబాబు అనుభవజ్ఞుడు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) దేశంలోనే కొద్దిమంది కలిగిన సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడని, ప్రజా కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి పని చేయడం గొప్పదని, తాము చరిత్ర సృష్టించి, దక్షిణ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.
Tungabhadra Dam Gates | నదుల అనుసంధానమే జీవిత ఆశయం
నదుల అనుసంధానమే తన జీవిత ఆశయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గంగా-కావేరి నదుల అనుసంధానంతో భారత్ అగ్రగామిగా, ‘అన్‌స్టాపబుల్’గా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఎఫెక్టివ్, పాజిటివ్ లీడర్ అంటూ చంద్రబాబు ప్రశంసించారు. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడరని, తెలంగాణ హక్కుల విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వరన్నారు. మనమందరం కలిసి పనిచేయాలి అంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి..: Fee Reimbursement GO 9 | ప్రైవేట్ కాలేజీలకు ఊరట.. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే!