Dharmapuri Arvind | బండి సంజయ్ విషయంలో ఎందుకు మౌనం? ఎంపీ అరవింద్‌ను ఫోన్ కాల్‌లో నిలదీసిన మహిళ

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Dharmapuri Arvind |నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, అనిత అనే మహిళా ప్రతినిధి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బండి సంజయ్ విషయంలో ఎంపీ స్పందనపై అనిత నిలదీయగా, అరవింద్  ఇలా అన్నారు.

Dharmapuri Arvind | ఫోన్‌కాల్‌లో ఇరువురి మధ్య సంభాషణ..

“బండి సంజయ్ ఇష్యూపై మీరు ఒక మాట కూడా మాట్లాడటం లేదు. జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు ఖండించడం లేదు?” అని అనిత ఎంపీని ప్రశ్నించారు. దీనికి అరవింద్ స్పందిస్తూ.. “నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. నన్ను పార్టీలొ అడిగినప్పుడు మాత్రమే నేను సమాధానం చెబుతాను. ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది నాకు తెలుసు అని స్పష్టం చేశారు. సంభాషణ మధ్యలో ఎంపీ.. “మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?” అని అడగగా, ఆమె హైదరాబాద్‌లోని రహమత్ నగర్ అని చెప్పారు. తాను ఒక ప్రైవేట్ ఉద్యోగిని అని, బాధ్యత గల పౌరురాలిగా అడుగుతున్నానని ఆమె పేర్కొన్నారు.

Dharmapuri Arvind | మహిళల పట్ల బాధ్యత..

అనిత ప్రశ్నిస్తూ.. “జరుగుతున్న అన్యాయంపై మీరు ఎందుకు స్పందించడం లేదు? ఇది మహిళల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా! కనీసం జరిగిన తప్పును తప్పు అని కూడా ఖండించరా?” అని నిలదీశారు. దానికి ఎంపీ అరవింద్ బదులిస్తూ.. “మహిళల పట్ల నాకు ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది. ఆ విషయంలో మీ దగ్గర నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశంపై నేను స్పందించలేను” అని  చెప్పారు.

Dharmapuri Arvind | సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు..

“తప్పు అని తెలిసినా ఎందుకు బయటకు వచ్చి ఖండించడం లేదు?” అని ఆమె పదే పదే ప్రశ్నించగా.. “అనిత గారు, మీరు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా బాధ్యతలు నాకు తెలుసు” అని అరవింద్ సమాధానమిచ్చారు. “అసలు నన్ను అడగడానికి మీరు ఎవరు? ఎవరికి సమాధానం చెప్పాలో నాకు తెలుసు, మీరు వెళ్లి మీ పని చూసుకోండి” అంటూ ఎంపీ ఫోన్ కట్ చేశారు. ఈ ఆడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Tamil Nadu CM Vijay | తమిళనాడు సీఎం విజయ్​ సంచలన నిర్ణయం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *