Census Survey | జిల్లాలో కొనసాగుతున్న జనగణన.. 33 రకాల వివరాలు సేకరిస్తున్న అధికారులు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Census Survey | జిల్లావ్యాప్తంగా జనగణన (Census) పక్కాగా కొనసాగుతోంది. అధికారుల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబాల వివరాల సేకరిస్తున్నారు.

Census Survey | గృహ జాబితాలో..

గృహజాబితా సేకరణలో ప్రతి ఇంటి నిర్మాణ స్వభావం, కుటుంబీకుల వివరాలు, తాగునీరు, విద్యుత్​, శౌచాలయాలు సహా మొత్తం 33 రకాల వివరాలను ఎన్యూమరేటర్లు ‘హెచ్‌ఎల్‌పీసీ’ (HLPC) మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆయా వీధుల్లో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, రహదారులు, ప్రధాన స్థలాలను కూడా యాప్‌లో పొందుపరుస్తున్నారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొదటి మూడు రోజుల పాటు గృహాల మ్యాపింగ్ ప్రక్రియ చేయనున్నారు.

జనగణన ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య గణాంకాధికారిగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అదనపు ముఖ్య గణాంకాధికారిగా, డీఆర్​వో గణాంకాధికారిగా వ్యవహరిస్తారు. సీపీవో, డీఈవో, జెడ్పీ సీఈవో, డీఎంఈవోలు నేతృత్వ అధికారులుగా, పురపాలకాల కమిషనర్లు, మండల స్థాయిలో తహసీల్దార్లు ఛార్జ్ అధికారులుగా, ఎంపీడీవో, అటవీశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Census Survey | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

జనగణన ముసుగులో కొందరు ఇళ్లలోకి వచ్చి వివరాలు సేకరించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గణనకు వచ్చే వారు నిజమైన అధికారులేనా అని నిర్ధారించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి ఎన్యుమరేటర్‌కు ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేసిందని,  వివరాలు చెప్పే ముందు గుర్తింపు కార్డును తనిఖీ చేసి, వారు ధరించి ఉన్నారో లేదో చూడాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి..: SP Rajesh Chandra | చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆట కట్టించిన పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *