జాతీయంTVK MLA Shock | ఒక్క ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యేకు కోర్టు షాక్‌

TVK MLA Shock | ఒక్క ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యేకు కోర్టు షాక్‌

తమిళనాడు ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్​ హైకోర్టు షాక్​ ఇచ్చింది. బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVK MLA Shock | తమిళనాడు ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్​ హైకోర్టు (Madras High Court) షాక్​ ఇచ్చింది. టీవీకే బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Assembly elections) టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో ఒక స్థానానికి విజయ్​ రాజీనామా చేయడంతో టీవీకే బలం 107కు చేరింది. మెజారిటీకి 11 స్థానాలు తక్కువగా ఉండటంతో ఇతర పార్టీల మద్దతుతో విజయ్​ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఆయన అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. ఈ క్రమంలో టీవీకే ఎమ్మెల్యేను ఓటింగ్​లో పాల్గొనద్దని కోర్టు ఆదేశించడం గమనార్హం. దీంతో ఆ పార్టీ బలం 106కు చేరింది. కాంగ్రెస్​, వామపక్షాలు, ముస్లీం లీగ్​, వీసీకే మద్దతుతో ఆ సంఖ్య 119కి అవుతుంది. దీంతో విజయ్​ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమి లేదు.

TVK MLA Shock | పోస్టల్​ ఓట్ల లెక్కింపులో..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని శ్రీనివాస సేతుపతి (Srinivasa Sethupathi)ని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించకుండా ఆపాలని డీఎంకే నేత, సమీప అభ్యర్థి పెరియకరుప్పన్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన సేతుపతి శాసనసభ కార్యకలాపాలలో పాల్గొనకుండా మంగళవారం నిషేధం విధించింది. శివగంగై జిల్లాలోని తిరుప్పత్తూరు అసెంబ్లీ స్థానంలో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ, జస్టిస్‌లు విక్టోరియా గౌరీ, సెంథిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

TVK MLA Shock | రాష్ట్ర చరిత్రలో..

సేతుపతి 83,375 ఓట్లు సాధించగా, పెరియకరుప్పన్ 83,374 ఓట్లు పొందారు. ఇది రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యంత స్వల్ప మెజారిటీలలో ఒకటిగా నిలిచింది. ప్రాథమికంగా కేసు రుజువైందని పేర్కొంటూ, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సేతుపతి ఏ విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం, విశ్వాస ఓటు లేదా సభ సంఖ్యాబలాన్ని పరీక్షించే ఏ ఇతర ప్రక్రియలోనైనా ఓటు వేయకుండా కోర్టు ఆయనను నిరోధించింది.

TVK MLA Shock | ప్రభుత్వానికి ముప్పు లేదు

ప్రస్తుతం టీవీకే 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతర పార్టీల మద్దతుతో ఆ బలం 120కి చేరింది. తాజాగా కోర్టు తీర్పుతో ఒక ఎమ్మెల్యే ఓటింగ్​లో పాల్గొనరు. దీంతో ఇతర పార్టీలతో కలిసి పార్టీ బలం 119కి చేరనుంది. మ్యాజిక్​ ఫిగర్​ 118 కంటే ఒక స్థానం అధికంగా ఉండటంతో బలపరీక్షలో విజయ్​ ప్రభుత్వం గట్టెక్కనుంది. ఒకవేళ మద్దతు తెలిపిన పార్టీలు ఉపసంహరించుకున్నా.. అన్నాడీఎంకేలో చీలక వర్గం ఇప్పటికే విజయ్​కు మద్దతు తెలిపింది. ఎమ్మెల్యే షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు. దీంతో విజయ్​ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమి లేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Tamil Nadu CM Vijay | తమిళనాడు సీఎం విజయ్​ సంచలన నిర్ణయం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Highway Busstand | కామారెడ్డిలో హైవే బస్టాండ్ ఏర్పాటు చేయాలి..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Highway Busstand | జిల్లా కేంద్రమైన కామారెడ్డి...

JCD Prabhakar Politics|తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక

అక్షరటుడే వెబ్‌డెస్క్:JCD Prabhakar Politics|నటుడిగా ప్రజాదరణ పొంది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...

Hyundai New SUV | హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyundai New SUV | ఆటోమొబైల్ రంగ దిగ్గజ...

Cow Slaughter Ban | గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ డిమాండ్

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cow Slaughter Ban | గోవధ చట్టాన్ని పక్కాగా...