అక్షరటుడే, వెబ్‌డెస్క్: UPSC Prelims Results 2026 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2026 ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా సివిల్స్ మెయిన్స్ పరీక్షకు మొత్తం 13,343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
UPSC Prelims Results 2026 | 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరు
ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరుకానున్నారు.
అభ్యర్థులు తమ ఫలితాలను UPSC అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని కమిషన్ సూచించింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, దరఖాస్తు ప్రక్రియ, ఇతర వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.