El Nino Impact India | దేశంలో ఎల్‌నినో ప్రభావం.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : El Nino Impact India | దేశంలో ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. సూపర్ ఎల్‌నినోగా మారే అవకాశం ఉందని పేర్కనొనారు. 2015 నాటి పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వేశారు.

ఎల్​నిన్​ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్య మరియు తూర్పు పసిఫిక్‌లోని చాలా భాగాలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలు 2 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోతాయని అంచనా వేశారు. వ్యవసాయం, నీటి వనరులు, మత్స్య పరిశ్రమ, విపత్తు నిర్వహణ వంటి రంగాలపై దీని ప్రభావం ఉంటుంది.

El Nino Impact India | బలపడే అవకాశం

రాబోయే నెలల్లో ఎల్ నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉంది. భూమధ్య రేఖ పసిఫిక్‌లోని కీలక ప్రాంతాలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఇప్పటికే ఎల్ నినో పరిమితులను సమీపిస్తున్నాయి. భారతదేశంలో, బలమైన ఎల్ నినో సంవత్సరాలు తరచుగా బలహీనమైన రుతుపవనాలు, సుదీర్ఘ పొడి వాతావరణం, పెరిగిన ఉష్ణ ఒత్తిడితో ముడిపడి ఉంటాయి. ఎల్ నినో 2026 చివరి వరకు బలపడి 2027 జనవరి-ఫిబ్రవరి మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, దాని ప్రభావం 2027 మధ్యకాలం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

El Nino Impact India | సాగుపై ప్రభావం

El Nino Impact India

దేశంలో నైరుతి రుతుపవనాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. అయితే ఎల్​నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం లేదు. దీంతో వర్షాలు పడట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో 10శాతం వర్షపాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖరీఫ్‌తో పాటు సీతాకాలంపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్నారు. రైతులు పంటల సాగు విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: E20 Petrol Myth | ఇథనాల్ పెట్రోల్‌కు చీమలు.. అబద్ధం!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *