School Theek Karo | సీజేపీ కార్యకర్తలను తరిమికొట్టిన గ్రామస్థులు

కాక్రోచ్​ జనతా పార్టీ ప్రతినిధులను రాజస్థాన్​లోని ఓ గ్రామంలో ప్రజలు అడ్డుకున్నారు. వారిపై దాడి చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: School Theek Karo | దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని వెలుగులోకి తెచ్చేందుకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నేతలు ప్రతి గ్రామానికి వెళ్తూ ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా, బగ్రూ నియోజకవర్గం పరిధిలోని రాంపూరా కన్వార్‌పురా గ్రామంలో ఉన్న ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసేందుకు సీజేపీ బృందం  చేరుకుంది.

అయితే, ఈ పాఠశాల పాత భవనం ప్రమాదకరంగా మారడంతో అధికారులు దానిని ఎప్పడూ ఎనిమిదో నంబర్ గది తరహాలో మూసివేశారు. ప్రస్తుతం ఆ పాఠశాల తరగతులను పక్కనే ఉన్న ఒక గేదెల కొట్టంలో నిర్వహిస్తున్నారు. ఈ దుస్థితిని పరిశీలించేందుకు వచ్చిన సీజేపీ కార్యకర్తలను గ్రామస్థులు గ్రామం వెలుపలే  అడ్డుకున్నారు. అనంతరం వారిని తరిమికొట్టారు.

School Theek Karo | తీవ్ర వాగ్వాదం..

గ్రామానికి వచ్చే ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేసిన స్థానికులు.. సీజేపీ నాయకులతో తీవ్ర వాగ్వాదానికి దిగి వారిని వెనక్కి పంపివేశారు. ఈ పాఠశాల భవనాన్ని బాగుచేసే సామర్థ్యం తమకుందని, ప్రభుత్వం ఇప్పటికే దీనికోసం నిధులు మంజూరు చేసిందని గ్రామస్థులు తెలిపారు. సీజేపీ సభ్యుల తనిఖీల నేపథ్యంలో పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు, మీడియా రాకుండా రాష్ట్ర విద్యాశాఖ కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల వాస్తవ పరిస్థితిని బయటకు రాకుండా దాచేందుకే విద్యాశాఖ మంత్రి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ ర్యాంకా ఆరోపించారు. ప్రభుత్వ ఆజ్ఞలకు భయపడేది లేదని, రాజస్థాన్‌లోని అన్ని బడుల దుస్థితి మారే వరకు తమ ప్రచారం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి:  Dead Body in Car | కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *