International Yoga Day | ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఘన విజయం సాధించింది: ప్రధాని మోడీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: International Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

International Yoga Day | యోగా ఉద్యమం

యోగాను ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చడంలో ప్రజల భాగస్వామ్యం విశేషమని ప్రధాని అన్నారు. వివిధ దేశాలు, వర్గాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఆరోగ్యం, శ్రేయస్సు అనే ఉమ్మడి లక్ష్యంతో యోగా ద్వారా ఒక్కటవడం ప్రోత్సాహకరమైన పరిణామమని పేర్కొన్నారు.

Yoga Day

International Yoga Day | దైనందిన జీవితంలో భాగంగా

యోగం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెబుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం మరింత మందిని యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకునేందుకు ప్రేరేపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమాలు యోగాపై పెరుగుతున్న ఆదరణను, ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగాహనను ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.

Hyderabad Rain Traffic | ఫ్యూచర్​ సిటీ వెంపర్లాట.. ఉన్న సిటీ ఊగిసలాట.. చిన్న వర్షానికే ట్రాఫిక్ నరకం!.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బతీస్తున్న మౌలిక వసతుల వైఫల్యాలు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *