Hyderabad Accident | కారుతో బైకును ఢీకొట్టి.. బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లాడు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Accident | హైదరాబాద్​లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్​ బైక్​పై వెళ్తున్న తండ్రీకొడుకులను ఢీకొట్టాడు. దీనిపై అతడిని ప్రశ్నించడంతో కారుతో ఢీకొని ఆ వ్యక్తిని రెండు కిలోమీటర్లు లాక్కెళ్లాడు.

మీర్‌పేట్‌ (Meerpet)కు చెందిన ఎస్​కే జిలానీ, ఫైసల్ తండ్రీకొడుకులు. వీరు శనివారం రాత్రి బైక్​పై ఎల్‌బీనగర్‌ వైపు వెళ్తుండగా వెనుక నుంచి ఓ కారు ఢీకొంది. ఈ ఘటన గాయత్రినగర్ (Gayatrinagar)​ సమీపంలో చోటు చేసుకుంది. దీంతో ఫైసల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జిలానీ కారు డ్రైవర్​తో వాగ్వాదం చేశాడు. ఈ క్రమంలో కారు డ్రైవర్ బాధితులపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే, అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని ఆపడానికి జిలానీ కారుకు అడ్డంగా నిలబడ్డాడు.

Hyderabad Accident | స్థానికులు ఆపడంతో పరార్​

జిలానీ అడ్డుగా నిలబడ్డ సదరు కారు డ్రైవర్​ ఆపకుండా అతడిని ఢీకొని కారును అలాగే వేగంగా తీసుకెళ్లాడు. దీంతో జిలానీ బోనెట్​పై గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు. అయితే జిలానీ కారు కింద పడకుండా గట్టిగా పట్టుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. బాలానగర్ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు కారును ఆపారు. అయితే డ్రైవర్​ పరార్​ అయ్యాడు. జిలానీ కుమారుడు ఫైసల్ రెండు కాళ్లు విరిగాయి. కాగా కారుపై ‘ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ’ అని స్టిక్కర్‌ ఉండటం గమనార్హం.

 

ఇది కూడా చదవండి : Delhi Fire Accident | ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలడంతో నలుగురు సజీవదహనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *