Anakapalle Bus Accident | నక్కపల్లి సమీపంలో బస్సు బోల్తా.. త‌ప్పిన పెను ప్ర‌మాదం, 20 మందికి గాయాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anakapalle Bus Accident | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అనకాపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర‌ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నక్కపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడగా, అదృష్టవశాత్తూ ప్రాణనష్టం మాత్రం జరగలేదు. భువనేశ్వర్ (Bhuvaneswar) నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఈ ప్రైవేట్ బస్సు విశాఖపట్టణం (Visakhapatnam) నుంచి 38 మంది ప్రయాణికులతో బయలుదేరింది. నక్కపల్లి ప్రాంతానికి చేరుకునే సరికి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా రహదారి దాటి పక్కనే ఉన్న కాల్వ గుంతలో పడిపోయింది.

Anakapalle Bus Accident

Anakapalle Bus Accident | స్థానికుల సాహసం

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు అద్దాలు పగలగొట్టి, ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారి సమయోచిత చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 20 మందిలో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. గాయపడిన వారిని వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి (Nakkapalli Government Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

Anakapalle Bus Accident | ఈ ప్రమాదానికి

సమాచారం అందుకున్న పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీసి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ ఘటన మరోసారి రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవ‌డం, విశ్రాంతి ఎంత అవ‌స‌ర‌మో ఈ ప్రమాదం గుర్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Surgery | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అత్యవసర శస్త్రచికిత్స.. నిల‌క‌డ‌గా ఆరోగ్యం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *