Konda Surekha | కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్​ మీనాక్షి నటరాజన్​కు నివేదిక అందించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​కు నివేదిక అందించింది. ఆమె దానిని ఏఐసీసీకి సమర్పించనున్నారు.

కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్​తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆమె ఏకంగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై విమర్శలు చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్​ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పలువురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, నాయకులు సైతం సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. అయితే ఈ విషయం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ఎవరు ఏమి మాట్లాడొద్దన్నారు. ఈ క్రమంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించింది.

Konda Surekha | చర్యలు ఉంటాయా..

కొండా సుష్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. సొంత పార్టీ నేతలు సీఎంపై విమర్శలు చేయడంతో పార్టీ పలుచన అవుతుందని నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది.. దానిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అభిప్రాయాలు అధిష్ఠానం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే 20 మందికిపైగా ఎమ్మెల్యేలు సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమెను తొలగిస్తారా.. లేదా అలాగే కొనసాగిస్తారా అనేది త్వరలో తెలియనుంది.

ఇది కూడా చదవండి..: Suryapet Road Accident | సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *