అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJP Protest | నగరంలోని (Nizamabad) కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం (BJYM Nizamabad) నాయకులు వందేమాతరం(Vande Mataram) గీతాలాపన చేశారు.
BJP Protest | డీసీసీ కార్యాలయం ఎదుట..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ వందేమాతర గీతాలాపన చేయలేదని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. వారికి వందేమాతర గీతం ఎలా పాడాలనేది నేర్పించేందుకు తాము కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట వందేమాతరం గీతాలాపన చేశామన్నారు. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్, కార్పొరేటర్లు కల్పె అర్చన చిరంజీవి, సుధీర్, శశాంక్, శ్రావణ్ పలువురు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi Supreme Court | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట