Indian Stock Market | ఫ్లాట్‌గా సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market | పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తోంది. బ్యారెల్‌కు 87 డాలర్ల దిగువకు వచ్చింది. దీంతో మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.

Indian Stock Market | 7 పాయింట్ల లాభంతో

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఉదయం సెన్సెక్స్ 236 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 94 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 285 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో ప్రారంభమై 37 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 84 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో 77,782 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 24,318 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 స్టాక్స్ లాభాలతో, 16 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. కొటక్ బ్యాంక్ 2.86 శాతం, ఎటర్నల్ 1.58 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.29 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.10 శాతం, ఎస్బీఐ 0.90 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 1.49 శాతం, ఎయిర్‌టెల్ 1.06 శాతం, ఎల్టీ 0.88 శాతం, టెక్ మహీంద్రా 0.65 శాతం, బీఈఎల్ 0.64 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Aug 26 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల జోష్.. హైదరాబాద్‌లో రేట్లు ఇవే

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *