Tata Sierra EV | టాటా సియెర్రా ఈవీ కారు.. మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Tata Sierra EV | భారత ఆటోమొబైల్ రంగ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్.. తన ఐకానిక్ బ్రాండ్ సియెర్రాను సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV)కి సంబంధించిన స్పై షాట్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫొటోలు ఇప్పుడు టాటా కార్ల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే ఇది లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, దీని ధర రూ. 30 లక్షలలోపు ఉండొచ్చని భావిస్తున్నారు.

Tata Sierra EV | ప్రీమియం లుక్ తో..

లీక్ అయిన సమాచారం మేరకు టాటా సియెర్రా ఈవీ ఇంటీరియర్ చాలా ప్రీమియం లుక్ తో ఉండబోతోంది. 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాటా హారియర్, సఫారీలలో ఉన్న యూనిట్‌నే ఇందులోనూ వాడుతున్నట్లు సమాచారం. డ్రైవర్ డిస్‌ప్లే కూడా మిగిలిన టాటా కార్లలాగే డిజిటల్‌గా ఉండనుంది. రెగ్యులర్ సియెర్రా మాదిరిగానే స్టైలిష్ లుక్ తో రానుంది. ముందు భాగంలో కనెక్టింగ్ ఎలఈడీ బార్, డ్యుయల్ ఫంక్షన్ ఎలఈడీ డీఆరఎల్ లు, పవర్‌ఫుల్ ఎలఈడీ హెడ్‌లైట్లు ఉండే అవకాశాలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనం (Electric vehicle) కాబట్టి ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా మూసివేసి ఉంటుంది. వెనక భాగంలో స్లీక్ ఎలఈడీ కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉన్నాయి.

Tata Sierra EV | ఇతర ఫీచర్లు..

టాటా కార్లు భద్రతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. సియెర్రా ఈవీలోనూ లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లు ఉండే అవకాశాలున్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో ప్రయాణికులకు పూర్తి భద్రతను ఇస్తారని భావిస్తున్నారు.
మల్టీ మోడ్ రీజెనరేటివ్ బ్రేకింగ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Tata Sierra EV | బ్యాటరీ ప్యాక్‌లు..

టాటా సియెర్రా ఈవీ 65 కేడబ్ల్యూహెచ్ , 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లతో వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి..: Vehicle Sales India | వాహనాల అమ్మకాలలో జోరు.. గతనెలలో 26 లక్షల యూనిట్ల విక్రయం

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *