అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రమాదాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందని అంచనా వేయడంతో ట్రేడర్లు దానిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గురువారం భారత స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది.
Indian Stock Market | మార్కెట్లో ఒడిదుడుకులు..
దేశీయ మార్కెట్లు (Domestic Markets) గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. సెన్సెక్స్ 74,163 నుంచి 74,677 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 23,193 నుంచి 23,363 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 22 పాయింట్ల నష్టంతో 74,314 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 23,270 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,686 కంపెనీలు లాభపడగా 1,642 స్టాక్స్ నష్టపోయాయి. 207 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 113 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 139 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్ లాభపడగా.. 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్ 2.82 శాతం, బీఈఎల్ 2.38 శాతం, ఇండిగో 2.32 శాతం, ఎటర్నల్ 2.24 శాతం, మారుతి 1.64 శాతం లాభపడ్డాయి.
Top Losers : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.30 శాతం, టైటాన్ 1.14 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.03 శాతం, ఎస్బీఐ 0.67 శాతం, ఎయిర్టెల్ 0.52 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Today | లాభాల్లో ప్రధాన సూచీలు