అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 24 Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం, గల్ఫ్‌లో (Gulf) తీవ్రమవుతున్న ఘర్షణలతో ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లు దాటింది. దీంతో ద్రవ్యోల్బణ భయాలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
ట్రంప్ కొత్త టారిఫ్‌ల(New tariffs) ప్రకటనలతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సైతం వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలతో ప్రారంభం కానున్నాయి.
July 24 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 2.15 శాతం, ఎస్ అండ్ పీ 1.21 శాతం నష్టపోగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.12 శాతం లాభంతో ఉంది.
July 24 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.58 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.67 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.73 శాతం లాభపడ్డాయి.
July 24 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.33 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.98 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.23 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.09 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.89 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.59 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.72 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2.999 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,947 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100.15 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైసలు బలపడి 96.57 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.39 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.71 వద్ద ఉన్నాయి.