L&T Finance AI | ఎల్ & టీ ఫైనాన్స్ ప్లానెట్ యాప్‌లో ఏజెంటిక్ వాణిజ్య సేవలు.. పైన్ ల్యాబ్స్‌తో కీలక భాగస్వామ్యం

ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ (NBFC) ఎల్ & టీ ఫైనాన్స్ లిమిటెడ్ (LTF).. గ్లోబల్ ఫిన్‌టెక్ దిగ్గజం పైన్ ల్యాబ్స్‌తో కలిసి సరికొత్త సేవలను ముందుకు తెచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: L&T Finance AI | ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ (NBFC) ఎల్ & టీ ఫైనాన్స్ లిమిటెడ్ (LTF).. గ్లోబల్ ఫిన్‌టెక్ దిగ్గజం పైన్ ల్యాబ్స్‌తో కలిసి సరికొత్త సేవలను ముందుకు తెచ్చింది. ముంబైలో  ( Mumbai )జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. దీని ద్వారా ‘ఎల్ & టీ ఫైనాన్స్ ప్లానెట్’ యాప్‌లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఏజెంటిక్ స్టోర్‌ఫ్రంట్‌ను అనుసంధానించనున్నారు. తొలుత స్వయంచాలక విమాన బుకింగ్ సేవలతో ప్రారంభమయ్యే ఈ విధానం ద్వారా, వినియోగదారులు మాన్యువల్‌గా వెతకాల్సిన పని లేకుండా ఏఐ ఏజెంట్ల ద్వారానే అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు.

L&T Finance AI | ప్రత్యేకతలు..

కస్టమర్లు తమ ప్రయాణ ఉద్దేశాన్ని, అవసరాలను చెబితే చాలు.. కొనుగోలుదారు ఏజెంట్ స్వయంచాలకంగా విమానాలను శోధించి, టికెట్లు బుక్ చేసుకునేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. వినియోగదారులు నిర్దేశించుకున్న పరిమితులు , నియంత్రణల పరిధిలోనే ఈ ఏఐ ఏజెంట్లు సురక్షితంగా లావాదేవీలు నిర్వహిస్తాయి. ప్రస్తుతం విమాన బుకింగ్‌లతో మొదలైన ఈ సేవలను, సమీప భవిష్యత్తులో మరిన్ని వ్యాపారి విభాగానికి విస్తరించనున్నారు.

L&T Finance AI | సాంకేతిక భాగస్వామ్యం ..

పైన్ ల్యాబ్స్ పేమెంట్స్ ప్రోటోకాల్ (P3P), గ్రాంటెక్స్ ప్రోటోకాల్ ఆధారంగా ఈ సిస్టమ్‌ను రూపొందించారు. కొనుగోలుదారు వైపు, విక్రేత వైపు ఉండే ఏఐ ఏజెంట్లు పరస్పరం మాట్లాడుకుని లావాదేవీలను పూర్తి చేస్తాయి. విక్రేత ఏజెంట్ రియల్-టైమ్ విమాన లభ్యత, ఛార్జీల వివరాలను అందిస్తుంది. ప్లానెట్ యాప్‌లోని యూపీఐ (UPI) చెల్లింపు సదుపాయం ద్వారా P3P ప్రోటోకాల్ సహాయంతో చెల్లింపు ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తవుతుంది.

సాంప్రదాయ చాట్‌బాట్ల స్థాయిని దాటి, లావాదేవీలను మొదటి నుంచి చివరి వరకు స్వయంచాలకంగా పూర్తి చేసే ఈ నూతన విధానం డిజిటల్ బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Alisagar Cable Bridge | అలీసాగర్​పై తీగల వంతెనకు ప్రతిపాదనలు : అడిషనల్​ కలెక్టర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *