Rahul Priyanka FIR | కాంగ్రెస్ నేతలకు బిగ్ షాక్.. రాహుల్, ప్రియాంకలపై ఎఫ్ఐఆర్

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో 'ఇండియా' కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద షాక్‌గా మారింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Priyanka FIR | ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్  ( Gyanesh Kumar )రాజీనామా డిమాండ్‌తో ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద షాక్‌గా మారింది. ఈ ఆందోళన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కీలక నేతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమతి లేకుండా ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) కార్యాలయం ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించారనే ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

Rahul Priyanka FIR | కొనసాగిన హైడ్రామా..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో సాగిన ఈ మార్చ్‌ నీతి ఆయోగ్ కార్యాలయం వద్దకు చేరుకోగానే పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ బారికేడ్లెక్కి జాతీయ జెండాతో నిరసన వ్యక్తంచేశారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తరలిస్తుండగా తీవ్ర ఉద్రిక్తత, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలు ఆకాశవాణి కార్యాలయం భవనంలోకి దూసుకెళ్లారు.

Rahul Priyanka FIR |  కదిలేది లేదంటూ..

సీఈసీ రాజీనామా చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ వారు భీష్మించుకు కూర్చున్నారు. చివరకు రాత్రి 9 గంటల తర్వాత పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులను అదుపులోకి తీసుకుని, రాత్రి 10 గంటల సమయంలో విడిచిపెట్టారు.

ఇది కూడా చదవండి:  Vivo V80 5G | సరికొత్త ప్రీమియం ఫోన్ లాంచ్ చేసిన వీవో.. అక్టోబర్ 13 నుంచి అందుబాటులోకి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *