Nandipet Bus Services | సమయానికి రాని బస్సులు.. ప్రయాణికులకు ఇబ్బందులు..

సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నందిపేట్​: Nandipet Bus Services | సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవట్లేదని వారు వాపోతున్నారు.

Nandipet Bus Services | నందిపేట్​ బస్టాండ్​ నుంచి..

నందిపేట్ (Nandipet) ప్రయాణ ప్రాంగణంలో బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికుల అవస్థలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బస్టాండ్ ఆవరణలోకి ప్రైవేటు వాహనాలు ఇష్టానుసారంగా రావడంతో ఇబ్బందులుకు గురవుతున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు వందల సంఖ్యలో బస్టాండ్​కు వస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడంతో వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బస్సుల ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని బస్టాండ్​ లోపల ప్రైవేట్ ఆటోలు, వ్యాన్లు నిలిపి ఎక్కించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. ఎప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి సమయానికి బస్సులు నడిపించాలని.. బస్టాండ్ లోపలికి ప్రైవేట్ వాహనాలను అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Nandipet Bus Services | సమయానికి బస్సులు నడపాలి..

– భోజన్న, నందిపేట్

బస్సులు సమయానికి రాకపోవడం.. రెండు బస్సులు ఒకేసారి రావడం జరుగుతోంది. బస్సుల్లో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే అధికారులు స్పందించి సమయానికి బస్సులు వచ్చేటట్లు చేయాలి. అలాగే బస్టాండ్​లో తాగునీటి వసతి కల్పించాలి.

ఇది కూడా చదవండి..: Nizamabad SIR Protest | ఎస్​ఐఆర్​ అమలును నిరసిస్తూ జ్ఞానేష్​ కుమార్​ దిష్టిబొమ్మ దహనం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *