Transgender Awareness | ట్రాన్స్​జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, గౌరవప్రదంగా జీవించాలి

ట్రాన్స్​జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Transgender Awareness | ట్రాన్స్​జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పేర్కొన్నారు. నగరం (Nizamabad)లోని సీసీఎస్​ పోలీస్​స్టేషన్​లో బుధవారం జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Transgender Awareness | న్యూసెన్స్​ చేయవద్దు..

Transgender Awareness

శ్రీశైలం మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, న్యూసెన్స్‌కు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించేందుకు హక్కు ఉందని.. ఆ హక్కును కాపాడుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత మార్గాల్లో సహాయం పొందాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్టాన్ని ఆశ్రయించాలన్నారు. ట్రాన్స్‌జెండర్లకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14427ను సంప్రదించాలని సూచించారు. సీసీఎస్​ సీఐలు సురేష్​, అజయ్, సాయినాథ్, ఎస్సైలు మహేష్, భీమ్​రావు, మహిళ ఆర్ఎస్సై స్రవంతి, సఖీ సెంటర్ ఇన్​ఛార్జి భానుప్రియ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bodhan Market Committee | బోధన్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా నాగేశ్వర రావు ప్రమాణస్వీకారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *