TVK Resort Politics | తమిళనాట ‘రిసార్ట్’​ రాజకీయాలు షురూ.. ఫలితాలకు ముందే అలర్ట్ అయిన టీవీకే అధ్యక్షుడు విజయ్​..

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉండటం, హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) తన అభ్యర్థులు చేజారిపోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు తెలుస్తోంది.

TVK Resort Politics | మహాబలిపురంలో రిసార్ట్ బుక్..

ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోతే అభ్యర్థులను ప్రలోభపెట్టే అవకాశం ఉందని భావించిన విజయ్, ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరలేపినట్లు సమాచారం. ఇందుకోసం మహాబలిపురంలో ఒక లగ్జరీ రిసార్ట్‌ను పార్టీ బుక్ చేసినట్లు సమాచారం. గెలిచిన టీవీకే అభ్యర్థులు నేరుగా ఆ రిసార్ట్‌కు చేరుకోవాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. రేపు (మే 4న) ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

TVK Resort Politics | హోరాహోరీగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

తమిళనాడులోని 234 స్థానాలకు గానూ ఏప్రిల్ 23న పోలింగ్ ముగిసింది. అయితే ఫలితాలపై జాతీయ, ప్రాంతీయ సర్వేలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.

యాక్సిస్ మై ఇండియా: ఈ సర్వే ప్రకారం టీవీకే అనూహ్యంగా 98-120 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. డీఎంకే కూటమికి 92-100, ఏఐఏడీఎంకే కూటమికి 22-32 సీట్లు రావచ్చని అంచనా వేసింది.

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్: మెజారిటీ సంస్థలు మాత్రం డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) తిరిగి అధికారంలోకి వస్తుందని, టీవీకే ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని పేర్కొన్నాయి.

TVK Resort Politics | టీవీకే కింగ్ మేకర్‌గా మారే అవకాశం..

ఈ విరుద్ధమైన అంచనాల మధ్య ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే టీవీకే కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. అందుకే అభ్యర్థుల రక్షణ కోసం విజయ్ ఈ విధమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Punjab Kings Fan | సిక్సర్‌తో గాయమైన అభిమానికి అండగా పంజాబ్ కింగ్స్.. వీడియో కాల్ చేసి మ్యాచ్‌కి ఆహ్వానించిన ప్రీతి జింటా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *