Amazon Ganesh Chaturthi Store | అమెజాన్‌లో ఏఐ ఆధారిత పండుగ స్టోర్.. గణేష్ చతుర్థి షాపింగ్ ఇక మరింత సులువు

వినాయక చవితి వేడుకల కోసం ఇళ్లను పండుగ శోభతో తీర్చిదిద్దాలనుకునే కస్టమర్ల కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా 'గణేష్ చతుర్థి స్టోర్'ను అందుబాటులోకి తెచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే  వెబ్‌డెస్క్: Amazon Ganesh Chaturthi Store | వినాయక చవితి వేడుకల కోసం ఇళ్లను పండుగ శోభతో తీర్చిదిద్దాలనుకునే కస్టమర్ల కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా ‘గణేష్ చతుర్థి స్టోర్’ను అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో అనుసంధానించిన ఈ స్టోర్ ద్వారా పండుగకు కావలసిన ప్రతి వస్తువును ఒకే వేదికపై సులభంగా కొనుగోలు చేయవచ్చు. పర్యావరణహిత విగ్రహాలు, పూజా సామాగ్రి నుంచి సాంప్రదాయ దుస్తులు, గృహాలంకరణ, మిఠాయిల వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి. అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ సౌకర్యంతో పాటు, కస్టమర్ల వ్యక్తిగత ప్రాధాన్యతలకు తగినట్లుగా ఈ స్టోర్ షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తోంది.

Amazon Ganesh Chaturthi Store | ప్రత్యేక ఆఫర్లు ..

అమెజాన్ నౌ ద్వారా నిమిషాల్లో డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గణేశ విగ్రహాలు, ఉండ్రాళ్ళు, పానీయాలు, నిత్యావసర వస్తువులపై 65% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా 55కి పైగా నగరాల్లో చివరి నిమిషం షాపింగ్ అవసరాల కోసం వీటిని నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నారు. ఇళ్ల అలంకరణ మరియు పూజా సామగ్రిపై భారీ తగ్గింపులు ప్రకటించారు. గృహాలంకరణ, లైటింగ్, పూజా సామాగ్రి వంటి వస్తువులపై 80% వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే పండుగ స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, రోజువారీ వంట సామాగ్రిపై 50% వరకు డిస్కౌంట్ ఉంది. సాంప్రదాయ ఫ్యాషన్ దుస్తులపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. కుర్తాలు, సల్వార్లు, కుర్తీలు, చీరలు, ఆభరణాలు, యాక్సెసరీలు వంటి పండుగ దుస్తులపై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు ప్రైమ్ సభ్యులు హోమ్, కిచెన్, ఫ్యాషన్, బ్యూటీ వంటి వివిధ కేటగిరీలలో అదనంగా మరో 5% ఆదా చేసుకోవచ్చు.

Amazon Ganesh Chaturthi Store | ఏఐ సాధనాలు..

షాపింగ్‌ను మరింత సులభం చేయడానికి అమెజాన్ అధునాతన ఏఐ సాధనాలను పరిచయం చేసింది. “రూ. 1,000 లోపు పూజా గృహాలంకరణ వస్తువులు చూపించు” లేదా “గణేష్ చతుర్థికి పూజ పళ్ళెం కావాలి” వంటి సహజమైన ఆదేశాల ద్వారా ‘రూఫస్’ (Rufus) నచ్చిన ఉత్పత్తులను సూచిస్తుంది. అలాగే 30 నుంచి 90 రోజుల ప్రైస్ హిస్టరీని ట్రాక్ చేసి, కోరుకున్న ధరకు వస్తువు రాగానే అలర్ట్ చేస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కేవలం ఒక ఫోటో తీయడం ద్వారా ‘లెన్స్ ఏఐ’ (Lens AI) సహాయంతో కావలసిన ఉత్పత్తులను తక్షణమే వెతికి పట్టుకోవచ్చు. అదనంగా AI రివ్యూ హైలైట్స్, క్విక్ లెర్న్, బయింగ్ గైడ్స్ వంటి ఫీచర్లు ఉత్పత్తులను సులభంగా అంచనా వేయడానికి దోహదపడతాయి.

ఇది కూడా చదవండి: Alisagar Cable Bridge | అలీసాగర్​పై తీగల వంతెనకు ప్రతిపాదనలు : అడిషనల్​ కలెక్టర్​

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *