NEET Paper Leak protest | నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోడీ కీలక ప్రకటన.. సోనం వాంగ్​చుక్​ 26 రోజుల నిరాహార దీక్షవిరమణ

ప్రభుత్వ హామీలపై సోనం వాంగ్చుక్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని అభిజిత్ ప్రకటించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NEET Paper Leak protest | నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. అర్ధరాత్రి ఎక్స్ (X) వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అలాగే నేడు జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

NEET Paper Leak protest | అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా

నీట్ పేపర్ లీక్ దేశంలో అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీక్ ఘటనలకు పాల్పడిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపడతామని తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని వెల్లడించారు.

రీఎగ్జామ్ నిర్వహణతో విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారని, విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండేందుకే మళ్లీ పరీక్ష నిర్వహించామని ప్రధాని మోడీ చెప్పారు. పేపర్ లీక్ కేసుల్లో నిందితులపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Devshayani Ekadashi | తొలి ఏకాదశి రోజు ఈ దానాలు చేస్తే లచ్చిందేవి వద్దన్నా వస్తుంది.. పూజా విధానం ఇలా ఉండాలి

NEET Paper Leak protest | నిరాహార దీక్ష విరమణ..

కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో సామాజిక కార్యకర్త సోనం వాంగ్​చుక్​ 26 రోజులుగా కొనసాగిస్తూ వచ్చిన తన నిరాహార దీక్షను విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

చర్చల సందర్భంగా విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని, పేపర్ లీక్ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రభుత్వ హామీలపై సోనం వాంగ్చుక్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని అభిజిత్ ప్రకటించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *