Modi Birthday Wishes | ప్రధాని మోదీకి బర్త్‌డే విషెస్.. వెల్లువెత్తిన అగ్రరాజ్య నేతల శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Birthday Wishes | ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచ దేశాల అగ్రనేతలు కూడా ప్రధాని మోదీకి సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మోరిసన్ మోడీకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Modi Birthday Wishes | పుతిన్ ప్రశంసలు..

భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా కీలక పాత్ర పోషిస్తున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం పుతిన్ పంపిన జన్మదిన సందేశాన్ని విడుదల చేసింది. భారత్‌లో మోదీకి ఉన్న అపారమైన ప్రజాదరణను, అంతర్జాతీయ వేదికలపై ఆయనకు దక్కుతున్న గౌరవాన్ని పుతిన్ ప్రస్తావించారు. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో తనకు, రష్యా ప్రతినిధి బృందానికి అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ దూరదృష్టి, రాజకీయ పరిజ్ఞానం ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్తున్నాయని పేర్కొన్నారు.

Modi Birthday Wishes | ట్రంప్, స్కాట్ మోరిసన్ విషెస్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున భారత్‌లోని యూఎస్ ఎంబసీ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. రాబోయే కాలంలో మోదీకి మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించింది. అలాగే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మోరిసన్ కూడా మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ వయసులోనూ మోదీ చూపిస్తున్న ఉత్సాహాన్ని ఆయన కొనియాడారు. ఇన్నేళ్లుగా పదవిలో ఉన్నప్పటికీ ఆయన పనితీరులో వేగం ఏమాత్రం తగ్గలేదని, ఆయన ఎనర్జీ లెవెల్స్ అద్భుతమని మోరిసన్ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి:  Narendra Modi Birthday | నవ భారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *