అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaushik Reddy | కరీంనగర్ (Karimnagar)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో కార్యాలయంలో ఫర్నిచర్‌తో పాటు కౌశిక్ రెడ్డి కారును ద్వంసం చేశారు. కాగా.. ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి స్పందించారు.
Kaushik Reddy | రేవంత్, బండి సంజయ్ కలిసే ప్లాన్ చేశారు..
నన్ను హత్య చేయడానికి కొందరు ప్రయత్నించారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది రేవంత్, బండి సంజయ్ (Bandi Sanjay) కలిసే ప్లాన్ చేశారని ఆరోపించారు. నన్ను హత్య చేసేందుకు రెక్కీ చేస్తున్నారని విలేకరుల సమావేశంలో చెప్పానని.. చెప్పినట్లుగానే నాపై దాడికి యత్నించారన్నారు. ఈ ఘటనతో రేవంత్, బండి సంజయ్ కలిసిపోయారని తేలిపోయిందన్నారు. కరీంనగర్‌లో శాంతిభద్రతలు లేవని.. ఈ ప్రాంతానికి గన్‌కల్చర్ తీసుకొస్తున్నారని అడిగానని.. దొంగలను ఎందుకు పట్టుకోలేదని అడిగితే నాపై దాడికి పాల్పడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kaushik Reddy | నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు
తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమీ చేయలేదని కౌశిక్ రెడ్డి అన్నారు. కేటీఆర్‌పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. కరీంనగర్‌లో ఏకంగా ఎమ్మెల్యేనే చంపడానికి వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి..: Karimnagar Tension | కరీంనగర్‌లో హైటెన్షన్.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నం..

