అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 13 Market Analysis | అంచనాల కంటే తక్కువగా ఉన్న యూఎస్ ద్రవ్యోల్బణం(US Inflation) నమోదు కావడంతో ఇన్వెస్టర్లు కాస్త ఊరట చెందారు. దీంతో రెండు సెషన్ల తర్వాత వాల్‌స్ట్రీట్ లాభాలబాట పట్టింది.
ప్రధాన ఆసియా మార్కెట్లు గురువారం మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతుండడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: Sravana Masam Muhurthalu | శ్రావణ మాసంలో శుభకార్యాల సందడి.. మంచి ముహూర్తాలు ఎప్పుడంటే?
Aug 13 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.54 శాతం, ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరగ్గా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.08 శాతం నష్టంతో ఉంది.
Aug 13 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.10 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.23 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.46 శాతం నష్టపోయాయి.
Aug 13 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.11 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.62 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.28 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.47 శాతం లాభంతో, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.46 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.09 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.16 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 1,022 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 5,841 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడి 95.33 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.98 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.69 వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 87.99 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.00 నుంచి 0.92 కు తగ్గింది.
- విక్స్ 1.39 శాతం తగ్గి 11.69 వద్ద ఉంది.