July 14 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

 ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమవుతుందన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 14 Market Analysis | అమెరికా -ఇరాన్ ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ముడి చమురు(Crude oil) ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

గత సెషన్‌లో యూరోప్ మార్కెట్లు లాభాలతో, వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలోని బలహీనతను అనుసరించి భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

July 14 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

చిప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో అమెరికా స్టాక్ మార్కెట్ గత సెషన్‌లో నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్(Nasdaq) 1.55 శాతం, ఎస్ అండ్ పీ 0.79 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.30 శాతం నష్టాలతో ఉంది.

July 14 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.19 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.15 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.11 శాతం లాభపడ్డాయి.

Strait of Hormuz | హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం మాదే.. అమెరికా-ఇరాన్ పరస్పర ప్రకటనలు

July 14 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.28 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.20 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.03 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.74 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.11 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.08 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.64 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,062 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,171 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • పీసీఆర్ 1.25 నుంచి 1.43కి పెరిగింది.
  • విక్స్ 8.39 శాతం పెరిగి 13.28 కి చేరింది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84.03 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు బలహీనపడి 95.62 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.20 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.62 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

ఇరాన్‌తో తమ దేశం మరోసారి యుద్ధంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చట్టసభ సభ్యులకు అధికారికంగా తెలియజేశారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఆ ప్రాంతంలో సైన్యాన్ని ఉపయోగించడానికి తన ప్రభుత్వానికి 60 రోజుల గడువు ఇచ్చారు.

ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల, భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 3.93 శాతం ఉండగా, జూన్‌లో అది 4.38 శాతానికి పెరిగింది. ఇది అంచనాలకు మించడం ఆందోళన కలిగిస్తోంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *