CSM Technologies IPO | ఐపీవోకు ఐటీ, డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ 24నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: CSM Technologies IPO | సీఎస్ఎం టెక్నాలజీస్ (CSM Technologies) సంస్థను 1998లో స్థాపించారు. ఈ-గవర్నెన్స్ ప్లాట్‌ఫాంలు, డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఈ కంపెనీకి సుదీర్ఘ అనుభవం ఉంది.

ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ క్లయింట్‌ల కోసం ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లను అందించే అతికొద్ది ఐటీ సొల్యూషన్ ప్రొవైడర్‌లలో ఒకటి. ఈ కంపెనీ గవర్నమెంట్ టెక్నాలజీ, డిజిటల్ పరివర్తనలో ప్రత్యేకత కలిగి ఉంది. మైనింగ్, వ్యవసాయం, వాణిజ్యం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, ప్రజా సేవలు వంటి రంగాలలో పరిష్కారాలను అందిస్తోంది.

CSM Technologies IPO | 12 దేశాలలో సేవలు..

భారతదేశంతోపాటు ఇథియోఫియా, కెన్యా, రువాండా, గాంబియా, గాబన్, యూఎసఏ, కెనడాతో సహా 12 దేశాలలో సేవలందిస్తోంది. దీని కస్టమర్ బేస్‌లో ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అభివృద్ధి సంస్థలు, ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి.

CSM Technologies IPO | రూ.146 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో..

CSM Technologies IPO

ఐటీ, డిజిటల్ సొల్యూషన్స్ రంగంలో సేవలు అందిస్తున్న సీఎసఎం టెక్నాలజీస్ కూడా స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ సంస్థ పూర్తిగా ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా రూ.146 కోట్లు సమీకరించాలని లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే మొత్తాన్ని కంపెనీ యొక్క నిర్వహణ మూలధన అవసరాలు, రుణాల చెల్లింపులు, అడ్వాన్సు చెల్లింపుతోపాటు గుర్తించని కొనుగోళ్లు, ఇతర వ్యూహాత్మక కార్యక్రమాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ నిధులను వెచ్చించనునుంది.

ధరల శ్రేణి : కంపెనీ ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్ ధరను రూ. 107 నుంచి రూ.113 మధ్య నిర్ణయించింది. ఒక లాట్‌లో 132 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద రూ. 14,916 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 50 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్ల కోటాను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్‌లో పెద్దగా డిమాండ్ లేదు. ఒక్కో ఈక్విటీ షేరు రూ. 4 ప్రీమియంతో ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 3.5 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ఐపీవో తేదీలు : జూన్ 24న ప్రారంభమయ్యే ఈ ఐపీవో.. జూన్ 29న ముగియనుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 30న వెలువడనుంది. కంపెనీ షేర్లు వచ్చేనెల 2న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టవుతాయి.

ఇది కూడా చదవండి..: Reliance Stock Rally | రిలయన్స్ దూకుడు.. భారీ లాభాల్లో సూచీలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *