Sports Infrastructure | మత్తుకు దూరంగా ఉండాలి : మంత్రి శ్రీహరి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sports Infrastructure | మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) కేంద్రంలో రూ.12.53 కోట్లతో చేపట్టనున్న క్రీడా మౌలిక సదుపాయాల పనులకు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం శంకుస్థాపన చేశారు.

మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్రీడలకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్న 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్​తో జిల్లాలోని యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ అందే అవకాశం కలుగుతుందని అన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జీవన శైలిని మార్చే శక్తివంతమైన సాధనం అని ఆయన అన్నారు. ప్రతి యువకుడు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలి అని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మైదానాల్లో సమయం వెచ్చించాలన్నారు. క్రీడా రంగ అభివృద్ధి కోసం అవసరమైతే వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గారు స్పష్టం చేశారు.

Sports Infrastructure | అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలి

Sports Infrastructure

యువత టైమ్‌పాస్‌గా కాకుండా క్రీడలను సీరియస్‌గా తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని మంత్రి (Minister Vakiti Srihari) సూచించారు. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో స్విమ్మింగ్ ఫూల్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. స్పోర్ట్స్ అసోసియేషన్లు మరింత చురుకుగా పనిచేసి గ్రామ స్థాయి నుండి యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని సూచించారు. లక్షలాది యువతకు క్రీడల ద్వారా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana University | తెయూలో వర్గపోరు.. రెండుగా విడిపోయిన ఆచార్యులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *