అక్షరటుడే, కామారెడ్డి : Mallupet Accident | సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లుపేట చౌరస్తా వద్ద సోమవారం ఉదయం రెండు కార్లు ఢీకొని పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్(Hyderabad) వెళ్తున్న మహీంద్రా XUV-300 కారు అదుపుతప్పి, కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న హ్యుందాయ్ ఆరా కారును బలంగా ఢీకొట్టింది.
Mallupet Accident | ఇన్‌ఛార్జి ఎస్పీ సాయిచైతన్య..
ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న కామారెడ్డి (Kamareddy) ఇన్‌ఛార్జి ఎస్పీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (Nizamabad CP) వెంటనే వాహనం ఆపి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో కమిషనర్ ఆదేశాలతో పోలీసులు వెంటనే స్పందించి ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఇది కూడా చదవండి: ప్రపంచం మారుతోంది… వార్తల ప్రపంచం కూడా మారాలి.