Stock Market Gains | లాభాలతో ముగిసిన మార్కెట్లు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | అమెరికా, ఇరాన్‌లు శాంతి చర్చలలో పురోగతి సాధించడంతో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. దీంతో మార్కెట్‌లో సానుకూల ధోరణి కనిపించినా.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగానే వ్యవహరించారు. ఇండెక్స్‌లలో కీలక వెయిటేజ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతు, ఐటీ రంగ షేర్లలో రిలీఫ్ ర్యాలీతో సూచీలు రాణించాయి.

Stock Market Gains | గ్యాప్ అప్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 358 పాయింట్ల లాభంతో ప్రారంభమై 152 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 317 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ప్రారంభమై 33 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 95 పాయింట్లు పైకి ఎగబాకింది. ప్రధాన సూచీలు స్వల్ప రేంజ్‌లోనే కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 291 పాయింట్ల లాభంతో 77,094 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 24,102 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,635 కంపెనీలు లాభపడగా 1,754 స్టాక్స్ నష్టపోయాయి. 197 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 217 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 64 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్ లాభపడగా.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 1.87 శాతం, సన్‌ఫార్మా 1.39 శాతం, రిలయన్స్ 1.31 శాతం, ఇన్ఫోసిస్ 1.29 శాతం, బీఈఎల్ 1.01 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఆసియన్ పెయింట్ 2.15 శాతం, టైటాన్ 1.11 శాతం, పవర్‌గ్రిడ్ 0.87 శాతం, ట్రెంట్ 0.78 శాతం, ఐటీసీ 0.75 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: CSM Technologies IPO | ఐపీవోకు ఐటీ, డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ 24నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *