April 29 Gold Rates | అతివలు ఆలోచించాల్సిందే.. బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల!

Naresh Chandan
April 29 Gold Rates

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 29 Gold Rates | మహిళలకు శుభవార్త. బంగారం, వెండి ధరలు Silver Prices క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 2026 ఏప్రిల్ 29 (బుధవారం) నాటి తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. గత కొన్ని వారాలుగా పెరిగిన ధరలతో వినియోగదారులు ఇబ్బంది పడగా.. ఇటీవ‌ల క‌నిపిస్తున్న ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది.

April 29 Gold Rates | క్ర‌మేపి త‌గ్గుద‌ల‌..

హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,350గా ఉండగా, దాదాపు రూ.2,540 వరకు తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,50,930కు చేరి సుమారు రూ.2,770 మేర తగ్గుదల నమోదు చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,070 వద్ద కొనసాగుతోంది. ముంబైలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,340 కాగా, 24 క్యారెట్ల ధర రూ.1,50,920గా నమోదైంది.

దక్షిణ భారతదేశంలో చెన్నై Chennai మార్కెట్‌లో మాత్రం ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,990 కాగా, 24 క్యారెట్ల ధర రూ.1,53,810 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,69,900గా ఉండగా, దేశవ్యాప్తంగా సగటు ధర రూ.2,60,000 నుండి రూ.2,65,000 మధ్యలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నప్పటికీ, పెద్దగా మార్పు లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ధరల మార్పులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమెరికా డాలర్ బలోపేతం కావడం, గ్లోబల్ స్థాయిలో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.

April 29 Gold Rates | దీర్ఘకాలంలో మళ్లీ..

అలాగే స్థానిక మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉండటం కూడా ధరలు తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు అనుకూలంగా మారింది. అయితే నిపుణులు చెబుతున్నదేమిటంటే, ప్రస్తుతం ధరలు తగ్గినా దీర్ఘకాలంలో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాలు భవిష్యత్ ధరలను Rates నిర్ణయించనున్నాయి.

Mumbai Kalma Attack Case | ప్రాణాల కోసం ఆరాటం… తెల్లవారుజామున భయానక క్షణాలు.. ముంబయిలో పహల్గావ్​ తరహాలో దాడికి ప్రణాళిక!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *