July 22 Gold Prices | బంగారం ధరలకు మళ్లీ ఊపు.. రెండు రోజుల్లో తులానికి సుమారు రూ.1,000 పెరుగుదల

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 22 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. ఇటీవల కొంతకాలం తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ వరుసగా పెరుగుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్-రూపాయి మారకం విలువల్లో మార్పులు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

July 22 Gold Prices | దేశీయ మార్కెట్‌లో

గత రెండు రోజుల వ్యవధిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1,000 వరకు పెరిగినట్లు మార్కెట్ సమాచారం సూచిస్తోంది. బుధవారం (జులై 22) ఉదయం నమోదైన ధరల ప్రకారం బంగారం స్వల్పంగా మరోసారి పెరిగింది.

Family Asset Trust | ఆస్తి రక్షణకు ధనికుల ఫైనాన్స్ సీక్రెట్: తరతరాలుగా సిరిసంపదలను కాపాడే ‘ట్రస్ట్’ విధానం!

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,230గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,210కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదై, కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.

July 22 Gold Prices | ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు:

  • హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,44,230, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,210, వెండి కిలో రూ.2,40,100.
  • విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం రూ.1,44,230, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,210, వెండి కిలో రూ.2,40,100.
  • ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ.1,44,380, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,360, వెండి కిలో రూ.2,34,900.
  • ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ.1,44,230, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,210, వెండి కిలో రూ.2,34,900.
  • చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ.1,44,230, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,210, వెండి కిలో రూ.2,40,100.
  • బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ.1,44,230, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,210, వెండి కిలో రూ.2,34,900.

అయితే బంగారం, వెండి ధరలు నగరాల వారీగా పన్నులు, రవాణా వ్యయం, స్థానిక మార్కెట్ పరిస్థితుల ఆధారంగా స్వల్పంగా మారే అవకాశం ఉంటుంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *