Iran War Cost | 37.5 బిలియన్ డాలర్లు దాటిన యుద్ధ వ్యయం..అదనపు నిధుల కోసం అమెరికా కాంగ్రెస్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం

తమ అణు కేంద్రాలపై ఎలాంటి దాడి జరిగినా దానిని ప్రాంతీయ యుద్ధ విస్తరణగా పరిగణించి తగిన ప్రతిస్పందన ఇస్తామని స్పష్టం చేసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran War Cost | ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక చర్యలపై అమెరికా ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ యుద్ధానికి సుమారు 37.5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చైనట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అయితే వాస్తవ వ్యయం దీనికంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా కాంగ్రెస్‌లో జరిగిన విచారణ సందర్భంగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ హాజరై, కొనసాగుతున్న సైనిక చర్యలకు అవసరమైన అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.

Iran War Cost | “పిక్‌యాక్స్ మౌంటెన్”పై త్వరలోనే దాడి

ఇదిలా ఉండగా, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ దాడులు ఇరాన్‌కు చెందిన కీలక సైనిక లక్ష్యాలపై కొనసాగుతున్నట్లు తెలిపింది.

Family Asset Trust | ఆస్తి రక్షణకు ధనికుల ఫైనాన్స్ సీక్రెట్: తరతరాలుగా సిరిసంపదలను కాపాడే ‘ట్రస్ట్’ విధానం!

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించినట్లు భావిస్తున్న భూగర్భ కేంద్రం “పిక్‌యాక్స్ మౌంటెన్” ప్రాంతంపై త్వరలోనే దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఇరాన్, తమ అణు కేంద్రాలపై ఎలాంటి దాడి జరిగినా దానిని ప్రాంతీయ యుద్ధ విస్తరణగా పరిగణించి తగిన ప్రతిస్పందన ఇస్తామని స్పష్టం చేసింది.

Iran War Cost | మరింత పెరుగుతున్న ఉద్రిక్తతలు

ఈ పరిణామాల మధ్య మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాలు తమ గగనతలంలోకి వచ్చిన వైమానిక దాడులను అడ్డుకున్నట్లు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటు దళాలు ఎర్ర సముద్రంలో ప్రయాణించే సౌదీ నౌకలకు హెచ్చరికలు జారీ చేశాయి.

మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం మరింత విస్తరించే అవకాశాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *