అక్షరటుడే, వెబ్డెస్క్: ATM Robbery | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ చోరీ జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని శతంరాయిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు.
శతంరాయి సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్లతో తెరిచారు. అందులోని సుమారు రూ. 32 లక్షల నగదుతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు.
ATM Robbery | నిందితుల కోసం గాలింపు
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పారిశ్రామిక స్థాయి కటింగ్ పరికరాలను ఉపయోగించి ఏటీఎంను తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఇటీవల నగరంలో దొంగతనాలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మేడిపల్లిలోని ఓ నగల దుకాణంలో భారీగా ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరీల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Water Bill Update Scam | వాటర్ బిల్ అప్‌డేట్ పేరుతో సైబర్ మోసాలు